ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరూత్థాన దినమున ప్రజలలో ఏ ఒక్కరు కూడా తమ తమ స్థానాల నుండి – వారిని కొన్ని విషయాల గురించి ప్రశ్నించబడే దాకా – స్వర్గం వైపునకు లేదా నరకం వైపునకు ఒక్క అడుగు కూడా కదపలేరు. మొదటిది: అతడి జీవితాన్ని గురించి – అతడు ఎలా గడిపాడు మరియు దేనిలో అంతం చేశాడు? రెండవది: అతడి జ్ఞానాన్ని గురించి – అతడు జ్ఞానాన్ని కేవలం అల్లాహ్ (యొక్క కరుణా కటాక్షాల) కొరకు మాత్రమే ఆర్జించినాడా? ఆర్జించిన జ్ఞానము ప్రకారం ఆచరించినాడా? మరియు ఆ జ్ఞానాన్ని అర్హులకు చేరవేసినాడా? మూడవది: అతడి సంపద గురించి: ఎక్కడినుండి సంపాదించినాడు? అది ధర్మబద్ధంగా ఆర్జించినదా లేక అధర్మంగా ఆర్జించినదా? ఆ సంపదను దేనిపై ఖర్చు చేసినాడు? అల్లాహ్ ఇష్టపడే వాటిపై ఖర్చు చేసినాడా లేక అల్లాహ్ కు అయిష్టమైన వాటిపై ఖర్చు చేసినాడా? నాలుగవది: అతడి శరీరము, శక్తి, ఆరోగ్యము మరియు యవ్వనం గురించి: అతడు వాటిని ఏవిధంగా వినియోగించినాడు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించినాడు?