ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు, ‘ఎదుటి వాడిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు ముస్లిములు కత్తులతో ఒకరిపై నొకరు దాడికి దిగితే, చంపినవాడు నరకంలో వేయబడతాడు. ఎందుకంటే, నేరుగా ఇతడు, అతడిని చంపినాడు కనుక’ సహచరులు ప్రశ్నించారు “మరి చనిపోయిన వాడు నరకంలో ఎలా వేయబడతాడు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “(అవకాశం దొరికితే) ఎదుటి వాడిని చంపాలనే అతడి ఉద్దేశ్యం కారణంగా అతడు కూడా నరకంలో వేయబడతాడు. చంపిన వాని చురుకుదనం, అతడి ముందంజ మరియు సఫల యత్నం తప్ప, చనిపోయిన వాడిని మరింకేదీ నిరోధించలేదు” అని తెలియ జేసినారు.