నజ్ద్ నుండి ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చాడు, అతని జుట్టు అస్తవ్యస్తంగా ఉంది, అతని గొంతు బిగ్గరగా ఉంది, కానీ అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం ధర్మం యొక్క తప్పనిసరి విధుల గురించి (ఫరాయిద్ గురించి) అడిగాడు. ప్రవక్త అతనికి సలాహ్ గురించి చెప్పడంతో ప్రారంభించారు, మరియు అల్లాహ్ ప్రతి దినము మరియు రాత్రిలో అతని కొరకు ఐదు సలాహ్’లను తప్పనిసరి చేశాడని తెలియజేసారు. అతను ఇలా అడిగినాడు: నేను ఈ ఐదు సలాహ్’లు తప్ప మరేదైనా (సలాహ్) చేయాలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అల్లాహ్ నీపై విధి గావించిన వాటిలో రమజాన్ మాసం ఉపవాసాలు కూడా ఉన్నాయి”. దానికి అతడు “రమజాన్ మాసపు ఉపవాసాలు గాక నేను ఇంకేమైనా ఉపవాసాలు పాటించవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛంద ఉపవాసాలు ఆచరిస్తే తప్ప” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ‘జకాత్’ గురించి ప్రస్తావించారు. ఆ వ్యక్తి “విధిగా చెల్లించవలసిన ఈ జకాతు గాక నేను ఇంకేమైనా దానములు చేయవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు. ఆ వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ విధి ఆచరణలను గురించి విన్న తర్వాత అతను వెనక్కి తిరిగి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై ప్రమాణం చేసాడు, అతను వాటికి దేనినీ జోడించకుండా లేదా వాటి నుండి ఏమీ తీసి వేయకుండా వాటికి కట్టుబడి ఉంటాడని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ వ్యక్తి తాను చేసిన ప్రమాణం గురించి నిజాయితీగా, సత్యవంతుడై ఉంటే, అతను విజయవంతమైన వారిలో ఉంటాడు.