ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావించారు: స్వర్గములోనికి చేరిన ప్రజలు సంతోషానందాలతో ఉండగా వారిని ఉద్దేశించి ప్రకటన చేసేవాడొకడు ఇలా ప్రకటిస్తాడు: స్వర్గంలో మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు, ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు, అది ఎంత చిన్న సుస్తీ లేక నలత అయినా సరే; అక్కడ మీరు శాశ్వత జీవితులై ఉంటారు, ఎన్నటికీ మరణించరు, అది స్వల్పకాల మరణంగా భావించబడే నిద్ర అయినా సరే; అక్కడ మీరు శాశ్వతంగా యవ్వనవంతులై ఉంటారు, ఎన్నటికీ వృధ్ధులు కారు; మరియు మీరు అక్కడ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో సంపన్నులుగా జీవిస్తారు, ఎప్పుడూ మీకు కష్టము, బాధ, పేదరికం కలుగవు. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తెలిపిన ప్రకటన: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!) సూరతుల్ ఆరాఫ్ 7:43.