ఉసామా బిన్ జైద్‌తో (రదియల్లాహు అన్హుమ్) తో ఇలా అనడం జరిగింది: “నీవు ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) వద్దకు వెళ్లి, ప్రజల మధ్య తలెత్తిన వివాదం గురించి అతనితో ఎందుకు మాట్లాడకూడదు మరియు దానిని పూర్తిగా చల్లార్చడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దానికి ఆయన వారికి ఇలా తెలియజేసినారు: విభేదాలు మరింతగా పెచ్చరిల్లకుండా ఉండాలని, జాతిప్రజల (ఉమ్మత్) యొక్క విశాల ప్రయోజనాన్ని ఆశిస్తూ తాను ఆయనతో రహస్యంగా మాట్లాడినానని, తన ఉద్దేశ్యం పాలకుడిని బహిరంగంగా ఖండించడం, లేదా నిందించడం కాదని, ఎందుకంటే, నేను అలా బహిరంగంగా ఖండించడం ఖలీఫా మీద దాడికి ఒక కారణం కావచ్చు; అది ఉపద్రవాన్ని, కీడును తీసుకుని వచ్చే ఒక చెడు ద్వారము, దానిని తెరవడానికి నేను మొదటి వాడిని కారాదు. తరువాత ఉసామహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: తాను అమీర్’ను (పాలకుడిని) ఒంటరిగా కలిసి (పరిస్థితులపై) తగిన సలహా ఇచ్చినానని, అతడు అమీర్ అయినా సరే తాను అతడిని పొగడనని, పాలకుల సమ్ముఖాన తప్పుడు ముఖస్తుతి చేయనని, ఇలా ఎందుకు అంటే, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విని ఉండడమే అని అన్నారు: “పునరుత్థాన దినమున ఒక వ్యక్తి తీసుకు రాబడతాడు మరియు అగ్నిలో విసిరివేయబడతాడు; వేడి తీవ్రత మరియు నరక శిక్ష యొక్క తీవ్రత కారణంగా అతని ప్రేగులు అతని కడుపు నుండి వెంటనే బయటకు వస్తాయి. ఈ స్థితిలో అతడు తన పేగులతో గానుగ చుట్టూ తిరుగుతూ ఉండే గాడిదలా నరకంలో తిరుగుతూ ఉంటాడు. నరక జనులు అతని చుట్టూ ఒక వృత్తాకారంలో గుమిగూడి, అతనిని చుట్టుముట్టి, “ఓ ఫలానా, నీవు మంచి చేయమని ఆఙ్ఞాపిస్తూ ఉండేవాడివి మరియు చెడును నిషేధిస్తూ ఉండేవాడివి కదా?” అని అడుగుతారు. దానికి అతడు: “అవును నిజమే, నేను మంచి చేయమని ఆదేశిస్తూ ఉండేవాడిని, కానీ నేనేఆచరించేవాడిని కాదు, చెడును నిషేధిస్తూ ఉండేవాడిని, కానీ నేనే ఆ పనులకు పాల్బడుతూ ఉండే వాడిని” అంటాడు.”