ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత అల్లాహ్ వారితో ఇలా అంటాడు: మీకు ఇంకా ఏమైనా కావాలా? అప్పుడు స్వర్గవాసులందరూ ముక్త కంఠముతో “(ఓ అల్లాహ్!) నీవు మా ముఖాలను తెల్లగా (మెరిసిపోయేలా) చేయలేదా? మమ్ములను స్వర్గములోనికి ప్రవేశింపజేసి, నరకాగ్ని నుండి రక్షించలేదా?” అంటారు. అప్పుడు అల్లాహ్ అడ్డుగా ఉన్న తెరను తొలగించి దానిని పైకి లేపివేస్తాడు. ఆయన యొక్క తెర ఒక ప్రకాశవంతమైన కాంతి. అప్పుడు స్వర్గవాసులకు తమ ప్రభువు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుని చూడడం కంటే అత్యంత ప్రియమైనది ఏదీ ఉండదు.