ఒకసారి ఈద్ దినమునాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ నమాజు ఆచరించుటకు, నమాజు ఆచరించే ప్రదేశానికి బయలుదేరినారు. ఆ సందర్భముగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మహిళలకు ప్రత్యేక ప్రసంగం ఇస్తానని వాగ్దానం చేశారు మరియు ఆ రోజున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇలా అన్నారు: “ఓ స్త్రీలారా! ఎక్కువగా దానధర్మాలు చేస్తూ ఉండండి, ఎక్కువగా క్షమాభిక్ష కొరకు అల్లాహ్’ను అర్థిస్తూ ఉండండి; పాపముల పరిహారం కొరకు ఉన్న సాధనాలలో అవి గొప్పసాధనాలు; ఎందుకంటే ఇస్రా ప్రయాణపు రాత్రి నరకవాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను.” అప్పుడు వారిలో తెలివైన, మంచి గ్రహణశక్తిగల, మరియు గౌరవప్రదమైన ఒక మహిళ: “ ఓ రసూలుల్లాహ్! నరకనివాసులలో ఎక్కువ మంది మేమే ఎందుకుంటాము?” అని ప్రశ్నించినది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “చాలా విషయాలలో మీరు తిట్లు తిడతారు, శాపనార్థాలు పెడతారు, దుర్భాషలాడతారు, అవమానిస్తున్నట్లుగా మాట్లాడుతారు, మీ భర్తల హక్కులను మీరు నిరాకరిస్తారు”. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని ఇలా వర్ణించారు: తెలివితేటలు, హేతుబద్ధత, జ్ఞానం మరియు తన వ్యవహారాలపై నియంత్రణ ఉన్న వ్యక్తిని కూడా దారి తప్పించడంలో మీ కంటే ఎక్కువ తెలివితేటలు మరియు నైతికత లోపించిన వారిని నేను చూడలేదు. ఆమె ఇలా అన్నది: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మా వివేకములో మరియు ధర్మములో కొరత ఏమిటి?” అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వివేకములో కొరత విషయానికొస్తే, (షరియతులో) ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక పురుషుడి సాక్ష్యానికి సమానం; వివేకములో కొరత అంటే ఇదే. ధర్మములో కొరత అంటే వారి మంచి పనులు చేసే అవకాశాలు తగ్గడం, ఎందుకంటే ఒక స్త్రీ రుతుస్రావం కారణంగా ఆ కాలంలో రాత్రింబవళ్ళు నమాజు ఆచరించకుండా గడుపుతుంది; అలాగే రుతుస్రావం కారణంగా రమదాన్ మాసములో తక్కువ రోజులు ఉపవాసం ఉంటుంది; ధర్మములో కొరత అంటే ఇదే. అయితే, వారు దానికి నిందార్హులు గానీ లేదా జవాబుదారులు గానీ కాదు; ఎందుకంటే ఇది వారి సహజ స్వభావంలో భాగం, పురుషులు సంపద పట్ల సహజమైన ప్రేమ, వారి విషయాలలో తొందరపాటు, అజ్ఞానం మరియు ఇతర లక్షణాలతో సృష్టించబడినట్లే (స్త్రీలు కూడా సహజంగానే ఆ విధంగా సృష్టించబడినారు). అయితే, వారితో మోహంలో పడకుండా ఉండటానికి ఇక్కడ ఇది హెచ్చరికగా ప్రస్తావించబడింది.