అంధుడైన ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు సహాయం చేయడానికి గానీ, ప్రతిరోజూ ఐదు పూటల నమాజు కొరకు నా చేయి పట్టుకుని మస్జిదునకు తీసుకు వచ్చే వారెవ్వరూ లేరు” అని జమాఅత్ ను వదలడానికి (తన ఇంటిలోనే నమాజు ఆచరించడానికి) ఆయన అనుమతి కోరాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతించినారు. అతడు వెనుతిరగగా ఆయన అతనితో “సలాహ్ కొరకు ఇవ్వబడే అదాన్ ను నీవు వినగలవా?” అని ప్రశ్నించారు. అతడు “అవును, వినగలను” అని జవాబిచ్చినాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే దానికి (అనుగుణంగా) స్పందించు (అంటే మస్జిదుకు వచ్చి జమాతుతో నమాజు ఆచరించు)” అన్నారు.