ఈ హదీథులో ఇమామ్‌తో కలిసి సామూహికంగా నమాజు ఆచరించే వ్యక్తికి లభించే ప్రతిఫలం మరియు బహుమానము అతడు ఇంట్లోనో లేదా మార్కెట్‌లోనో ఒంటరిగా ఆచరించే ఇరవై ఐదు నమాజుల కంటే గొప్పదని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వివరించారు. తరువాత ఆయన రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతలు ‘ఫజ్ర్’ నమాజు కోసం సమావేశమవుతారని ప్రస్తావించారు. అబూ హురైరా (రదియల్లాహు అన్హు) దీనికి ఆధారాలను ఉటంకిస్తూ ఇలా అన్నారు: “కావాలంటే మీరు (ఖుర్’ఆన్) చదండి: {ఇన్న ఖుర్’ఆనల్ ఫజ్రి కాన మష్’హూదా} (నిశ్చయంగా, ప్రాతఃకాల (ఖుర్‌ఆన్) పఠనం (దైవదూతల ద్వారా) వీక్షింప బడుతుంది. [సూరా అల్ ఇస్రా: 17:78] అంటే దాని అర్థము ఫజ్ర్ నమాజు రాత్రి సమయపు దైవదూతలు మరియు పగటి సమయపు దైవదూతల ద్వారా వీక్షించబడుతుంది అని.