అనస్ ఇబ్నె మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముందుగా తొలి పంక్తిని భర్తీ చేయండి. తర్వాత దాని వెనక పంక్తిని భర్తీ చేయండి. ఏమైనా వెలితి ఉంటే అది వెనక పంక్తిలోనే ఉండాలి.”
ప్రామాణికమైన హదీథు - అబూ దావూద్ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జమాఅత్ తో నమాజు చేసే పురుషులను ముందుగా తొలి పంక్తిని, తర్వాత దాని వెనుక పంక్తిని, ఇదే విధంగా (మిగతా పంక్తులను) భర్తీ చేయమని ఆదేశించారు. ఒకవేళ ఏదైనా పంక్తిలో వెలితి ఉంటే, ఆ వెలితి చివరి పంక్తిలో మాత్రమే ఉండాలి.
fawaed
పంక్తులను సరిచేయు సున్నత్ పద్ధతి యొక్క వివరణ ఇవ్వబడింది.
నమాజు ఆచరించేవారు ముందు పంక్తులలో వెలితిని వదలిపెట్టరాదు, బదులుగా వెలితి చివరి పంక్తిలోనే ఉండాలి.