ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఫజ్ర్ నమాజు చదివించినారు, తరువాత ఆయన: “ఫలాన అతను మనతో నమాజు ఆచరించినారా?” అని అడిగారు. సహాబాలు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరొక వ్యక్తిని గురించి “మరి ఫలానా అతను హాజరయ్యాడా?” అని అడిగారు. వారు “లేదు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఫజ్ర్’ మరియు ‘ఇషా’ నమాజులు కపట విశ్వాసులపై అత్యంత భారమైనవి. వారిలో సోమరితనం ఎక్కువ ఉంటుంది. పైగా తాము నమాజులకు హాజరువుతున్నామనే విషయం చీకటిలో కనిపించదు; వారి ప్రదర్శనా లాలస తీరదు. ఓ విశ్వాసులారా, ప్రతిఫలం పరంగా మరియు పుణ్యఫలం పరంగా ఫజ్ర్ మరియు ఇషా నమాజులలో ఏమి (శుభం దాగి) ఉన్నదో మీకు గనుక తెలిస్తే – ఎందుకంటే కష్టానికి తగిన అనుపాతంలో ప్రతిఫలం ఉంటుంది గనుక – మీరు మీ చేతులు మరియు మోకాళ్ళపై ప్రాకుతూ రావలసి వచ్చినా మీరు ఆ నమాజుల కొరకు (మస్జిదునకు) వస్తారు. నమాజులో ఇమాం వెనుక ఇమాం కు దగ్గరగా ఉండే మొదటి వరుస, సామీప్యములో సర్వోన్నతుడైన అల్లాహ్ కు దగ్గరగా ఉండే దైవదూతల వరుస వంటిది. ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజు కంటే మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) చేసే నమాజు ప్రతిఫలం మరియు ప్రభావంలో గొప్పది మరియు ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసే నమాజు ఒక వ్యక్తితో కలిసి చేసే నమాజు కంటే ఉత్తమమైనది. చాలా మంది ఆరాధకులు పాల్గొన్న నమాజు అల్లాహ్‌కు మరింత ప్రియమైనది మరియు ఉత్తమమైనది.