ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్లాహ్ సాక్షిగా’ అని అల్లాహ్ పై ప్రమాణం చేసి నీటి హౌజు నుండి నీటిని త్రాగడానికి ఉపయోగించే గిన్నెలు ఆకాశంలోని నక్షత్రాలకన్నా, అందులోని గ్రహాలకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటాయని తెలియజేస్తున్నారు. అలాగే ఇందులో ‘నల్లని రాత్రి’ అన్నారు. అంటే అందులో చంద్రుడు ఉండడు. చంద్రుని కాంతితో నిండి ఉన్న ఆకాశం లో నక్షత్రాలు స్పష్టంగా కనిపించవు. చంద్రుడి కాంతి వెనుక అవి కప్పబడి ఉంటాయి. అలాగే ‘మబ్బులు లేని ఆకాశంలో’ అన్నారు. ఎందుకంటే మబ్బులు నక్షత్రాలను సరిగా కనిపించనీయవు. ఇంకా ‘స్వర్గపు పాత్రల’ (కప్పుల) ప్రస్తావన ఉంది. ఎవరైతే అందులో (స్వర్గములో ఆ పాత్రల నుపయోగించి) దేనినైతే త్రాగుతారో వారికి దాని దాహము ఇంకెన్నటికీ వెయ్యదు. ఆ విషయపు దాహానికి సంబంధించి అది ఆఖరిది అవుతుంది. (దాహార్తి అంతగా సంతుష్ఠుడు అవుతాడు అని అర్థము). అలాగే ఈ హదీసులో ఆ నీటి హౌజు గురించి, అందులో స్వర్గపు రెండు ధారలు ప్రవహిస్తూ ఉంటాయని, దాని వెడల్పు దాని పొడవు అంత ఉంటుంది అని తెలియ జేయబడింది. అలాగే ఆ నీటి హౌజు యొక్క అంచులు సమానంగా ఉంటాయని, దాని పొడవు షామ్ దేశంలోని ‘బఖా’ లో ఒక నగరమైన అమ్మాన్ నుండి, షామ్ దేశపు సరిహద్దులలో ఉన్న, ఒక ప్రఖ్యాత నగరమైన ‘అయ్’లహ్’ కి మధ్య దూరమంత ఉంటుందని (ఉపమానంగా) తెలుపబడింది. అలాగే ఆ నీటి హౌజులోని నీరు పాలకన్నా తెల్లగా ఉంటుందని, దాని రుచి తేనె కన్నా మధురంగా ఉంటుందని తెలియ జేయబడింది.