ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: “ఓ ప్రవక్తా! మా మనసులలో (ఒక్కొక్కసారి) చాలా ఘోరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గురించి మాట్లాడడం కన్నా బూడిదగా మారిపోవడం మంచిది అనేంత ఘోరమైన ఆలోచనలు” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండుసార్లు ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్) పలికి, షైతాను యొక్క కుతంత్రాన్ని కేవలం ‘వసవసా’ (మనిషి హృదయంలో పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తించడం) వరకే పరిమితం చేసినందుకు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలిపారు.