ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అనేక పాపపు పనులకు ఒడిగట్టాను, అనేక అవిధేయతలకు పాల్బడ్డాను. ఏ ఒక్క చిన్న పాపాన్నీ, ఏ ఒక్క పెద్ద పాపాన్నీ వదలలేదు. మరి నేను క్షమించబడతానా?” అని ప్రశ్నించాడు బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏం నీవు ‘అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరెవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు’ అని సాక్ష్యము పలుకలేదా?” అని తిరిగి అతడిని ప్రశ్నించారు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని మూడు సార్లు ప్రశ్నించారు. అతడు “అవును, నేను సాక్ష్యము పలికాను” అని సమాధానం ఇచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’ (సాక్ష్యపు వాక్యములో ఉన్న రెండు సాక్ష్యపు పదబంధాలు) యొక్క ఘనతను వివరించారు, మరియు వాటిని ఉచ్ఛరించడం చెడు పనులకు పరిహారంగా అవుతుందని, మరియు అతడి పశ్చాత్తాపము అంతకు ముందు జరిగిన వాటిని హరిస్తుంది అని తెలియజేసారు.