ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి కడుపులో అసౌకర్యంగా ఉండి, ఒకవేళ కడుపు నుండి గాలి లాంటిది ఏదైనా బయటకు వెలువడిందేమో అనే సందేహానికి గురైతే – అతడు తిరిగి ఉదూ చేయుటకుగాను చేస్తున్న సలాహ్’ ఆపరాదు – ఉదూను భగ్నం చేసే పని జరిగిందని అతనికి నిర్ధారణ అయితే తప్ప; అది గాలి విడుదలైన శబ్దం వినడం గానీ లేక ఆ దుర్వాసనను గమనించడం గానీ. ఎందుకంటే ఒక నిర్దిష్ట విషయము సందేహాస్పదమైన విషయము ద్వారా రద్దు చేయబడదు. ఇందులో అతడు ఉదూ చేసి ఉన్నాడు అనేది నిర్దిష్ఠమైన విషయం, ఉదూను భగ్నం చేసే వాయువు (హదస్) వెలువడింది అనేది సందేహాస్పదమైన విషయం.