అమ్ర్ ఇబ్న్ షుఐబ్ రజియల్లాహు అన్హు తన తండ్రి నుండి, ఆయన తన తండ్రి (అమ్ర్ ఇబ్న్ షుఐబ్ తాత) నుండి ఉల్లేఖిస్తున్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు సలాహ్ (నమాజు) ఆచరించమని ఆదేశించండి; పది సంవత్సరాల వయసులో (సలాహ్ ఆచరించకపోతే) వారిని దండించండి; అలాగే వారి పడకలు (ఆడపిల్లల పడకలు, మగపిల్లల పడకలు) వేరు చేయండి.” హసన్ హదీథు - అబూదావూద్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా విశదీకరిస్తున్నారు: “తన సంతానం – ఆడపిల్లలు మరియు మగ పిల్లలు – ఏడు సంవత్సరాల వయసులో ఉన్నపుడు, సలాహ్ ఆచరించమని ఆదేశించడం, మరియు వారు సలాహ్ ఆచరించడానికి కావలసిన ఙ్ఞానాన్ని వారికి పొందుపరచడం (ప్రతి) తండ్రి యొక్క విధి. మరియు వారు (సంతానం) పది సంవత్సరాల వయసుకు చేరుకుంటే ఈ విషయం మరింత గంభీరమవుతుంది. అపుడు వారు సలాహ్ ఆచరించుటలో అలసత్వం, సోమరితనం వహిస్తే వారిని దండించాలి; అలాగే ఆడపిల్లల మరియు మగపిల్లల పడకలు వేరు చేయాలి.

explain-icon

fawaed

  • ఈ హదీసు ద్వారా – పిల్లలు యుక్త వయస్సుకు చేరకోకముందే వారికి ధర్మానికి సంబంధించిన విషయాలను బోధించాలని, అందులో సలాహ్ అత్యంత ముఖ్యమైన విషయమని తెలుస్తున్నది.
  • దండించడం వారిలో క్రమశిక్షణ తీసుకురావడం కొరకు మాత్రమే గానీ హింసించుట కొరకు కాదు అని గమనించాలి. కనుక దండన అనేది పిల్లల స్థితిని బట్టి వారికి తగినదిగా ఉండాలి.
  • (ధర్మం యొక్క) గౌరవాన్ని, ఘనతను కాపాడటం మరియు వాటిని భంగపరిచడానికి దారితీసే ప్రతి మార్గాన్ని నిరోధించడంలో షరియత్ అన్ని వేళలా శ్రద్ధ చూపుతుంది.
explain-icon

ఇంకా