అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు కు తరుచూ చిక్కగా, తెల్లగా, జిగటగా ఉండే మదీ అనే ద్రవం ఆయన పురుషాంగం నుండి విడుదలవుతూ ఉండేది. ఆ ద్రవం సాధారణంగా లైంగిక పరమైన ఆలోచనల వలన గానీ లేక సంభోగానికి ముందుగానీ విడుదలవుతుంది. తరుచూ ఆ విధంగా విడుదలవుతున్న ఆ ద్రవం విషయం లో ఏమి చేయాలో ఆయనకు అర్థమయ్యేది కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె ఫాతిమా ఆయన భార్య కావడంతో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను దానిని గురించి ప్రశ్నించడానికి సిగ్గుగా ఉండేది. కనుక ఆయన మిఖ్దాద్ బిన్ అల్ అస్వద్ రజియల్లాహు అన్హు ను, ఆ విషయాన్ని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించమని కోరారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా జవాబిచ్చారు: “అతడు పురుషాంగాన్ని కడుగుకుని వుజూ చేయాలి.”