మలవిసర్జన ద్వారా గానీ లేక మూత్రవిసర్జన ద్వారా గానీ ఎవరు కాల కృత్యాలు తీర్చుకోవాలి అనుకున్నా, ఖిబ్లహ్ వైపునకు – అంటే కాబా గృహం ఉన్న వైపునకు – ముఖం చేయరాదని, లేక ఖిబ్లహ్ తన వెనుక ఉండేలా దాని వైపునకు వీపు కూడా చేయరాదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. అలా కాక మదీనా వారికి లాగా ఖిబ్లహ్ ఉన్నట్లయితే వారు తూర్పు వైపునకు గానీ లేక పడమర వైపునకు గానీ తిరిగి కాలకృత్యాలు తీర్చుకోవాలి. (మదీనా వాసులకు ఖిబ్లహ్ దక్షిణం వైపునకు ఉంటుంది). అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసినారు – తాము అష్’షాం దేశానికి వెళ్ళినపుడు అక్కడ మరుగుదొడ్లు కాబా గృహం వైపునకు ముఖం చేసి నిర్మించబడి ఉన్నాయి. వాళ్ళు తమ దిశను మార్చుకుని వాటిపై కూర్చుని కాలకృత్యాలు తీర్చుకునేవారు. అయినప్పటికీ వారు అల్లాహ్’ను క్షమాభిక్ష కోరుకునేవారు.