ఉమ్మే ఖైస్ బింత్ మిహ్సన్ రదియల్లాహు అన్హా, అన్నం తినడం ప్రారంభించని తన చిన్న కుమారుడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ అతడిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అప్పుడు ఆ బాలుడు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు. దాంతో ఆయన నీటిని తెప్పించి, తన వస్త్రంపై చిలకరించారే గానీ, దానిని కడగలేదు.