ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విషయం గురించైనా మొక్కుకోవడాన్ని నిషేధించినారు. మొక్కుకొనుట అంటే ఒక వ్యక్తి, షరియత్ ప్రధాత అయిన అల్లాహ్ ద్వారా అతనిపై ‘విధి’ చేయబడని విషయాన్ని తనపై విధిగావించుకొనుట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మొక్కుబడులు (విధిలిఖితమైన) ఏ విషయాన్నీ ముందుకు జరుపలేవు, అలాగే వెనుకకూ జరుపలేవు. అవి, తనపై విధిగావించబడిన వాటిని తప్ప (స్వచ్ఛంద ఆరాధనలు) ఏవీ చేయని పిసినారి నుండి నిశ్చయంగా ఎంతో కొంత బయటకు తీయగలవు. మొక్కుబడులు అతని విధివ్రాతలో లేని ఏ విషయాన్నీ అతని కొరకు తీసుకుని రాలేవు.”