ఈ హదీసులో అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు తాను తన తెగకు చెందిన మరి కొంతమందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినానని ఉల్లేఖిస్తున్నారు. వారి ఉద్దేశ్యం జిహాద్’లో పాల్గొనడానికి స్వారీ వాహనాలుగా తమకు ఒంటెలను సమకూర్చమని వారిని కోరడం. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి స్వారీ వాహనాలను సమకూర్చను అని అల్లాహ్ పై ప్రమాణం చేసి చెప్పి, వారికి ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేదు అని అన్నారు. అపుడు వారు కొద్దికాలం వేచి ఉన్నారు, అప్పుడు మూడు ఒంటెలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాయి; ఆయన వాటిని వారి వద్దకు పంపారు. వారిలో కొందరు ఒకరితో ఒకరు ఇలా అన్నారు: “ఈ ఒంటెల ద్వారా అల్లాహ్ మనలను అనుగ్రహించడు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని అల్లాహ్ పై ప్రమాణం చేసి మనకు వాహనాలను సమకూర్చను అని అన్నారు”. దానితో వారందరూ ఆయన వద్దకు వచ్చి తమ మధ్య జరిగిన సంభాషణను ఆయన వద్ద ప్రస్తావించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీకు వాహనాలను సమకూర్చినది సర్వోన్నతుడైన అల్లాహ్ మాత్రమే. ఎందుకంటే సహాయాన్ని మరియు ఉపాధిని కల్పించే (మరియు కల్పించే వాడు) ఆయనే, నా చేతుల ద్వారా ఇది జరగడానికి నేను ఒక కారణాన్ని మాత్రమే. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను - అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – నేను ఏదైనా విషయం కొరకు, చేయడానికి గానీ లేక వదిలివేయడానికి గానీ ప్రమాణం చేస్తే, తరువాత నేను ప్రమాణం చేసిన దాని కంటే వేరొక విషయాన్ని మంచిదిగా, శుభప్రరదమైనదిగా నేను చూసినట్లయితే, నేను ఆ శుభప్రదమైన విషయాన్నే ఎంచుకుంటాను, నేను ముందు ప్రమాణం చేసిన విషయాన్ని వదిలివేసి, అందుకు గానూ పరిహారం చెల్లిస్తాను.”