ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ స్థాపించబడుటకు సమీప కాలములో ప్రస్ఫుటమయ్యే సూచనలను తెలియ జేస్తున్నారు – అందులో ఒకటి (ఈ భూమి నుండి) షరియత్ యొక్క ఙ్ఞానము లేపుకోబడుతుంది. అది ఙ్ఞానవంతుల, పండితుల, విద్వాంసుల మరణం వలన సంభవిస్తుంది. దాని పరిణామముగా అఙ్ఞానము విపరీతముగా పెరుగుతుంది, అంతటా వ్యాపిస్తుంది. వ్యభిచారము, అశ్లీలత విపరీతంగా వ్యాపిస్తాయి. సారా త్రాగడం సర్వ సాధారణమైపోతుంది. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. స్త్రీల సంఖ్య పెరిగిపోతుంది. ఎంతగా అంటే, యాభై మంది స్త్రీలకు వారి వ్యవహారాలు, మంచిచెడులు చూడడానికి ఒక పురుషుడు మాత్రమే ఉంటాడు.