ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే ముఅజ్జిన్ అదాన్ పలుకుట పూర్తి అయిన తరువాత ఈ క్రింద తెలుపబడిన విధంగా పలుకుతాడో: (అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతి) - ఓ అల్లాహ్! ఈ పిలుపునకు ప్రభువా! అంటే ఇవి అల్లాహ్‌ను ఆరాధించడానికి మరియు నమాజు చేయడానికి ప్రజలను పిలవడానికి ఉపయోగించే అదాన్ పదాలు. వాటి ద్వారానే నమాజు కొరకు పిలుపు ఇవ్వబడుతుంది. (అత్’త్తామ్మతి) – అత్యంత పరిపూర్ణమైన (పిలుపు); అత్యంత పరిపూర్ణమైనది అంటే, తౌహీద్ (ఏకదైవత్వం) యొక్క పిలుపు మరియు దైవిక సందేశం; (వస్సలాతిల్ ఖాఇమహ్) మరియు స్థాపించబడబోయే ఈ నమాజు, అంటే, ఆ ఆరాధన నిరంతరం ఆచరించబడునటువంటిది, మరియు ప్రస్తుతం ప్రారంభించబడబోతున్నటువంటిది; (ఆతి) ఓ అల్లాహ్! ప్రసాదించు; (ముహమ్మదన్ అల్ వసీలత) అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానాన్ని ప్రసాదించు; (అల్ ఫజీలత) అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఔన్నత్యాన్ని ప్రసాదించు, అంటే తీర్పు దినమున సృష్టిరాశులలో వాటన్నింటి స్థాయిల కంటే అత్యంత ఉన్నతమైన స్థాయిని ప్రసాదించు; (వబ్’అథ్’హు) ఆయనకు ప్రసాదించు, (మఖామన్ మహ్’మూదన్) శ్రేష్ఠమైన, ప్రతిష్ఠాత్మకమైన, అత్యున్నతమైన స్థానము, అక్కడ నిలబడిన వాడు ప్రశంసించబడతాడు, అంటే అది పునరుత్థాన దినమున సిఫారసు చేసే అన్నింటి కంటే గొప్ప అవకాశం, (అల్లదీ వఅద్’తహు) నీవు దేనినైతే ఆయనకు ప్రసాదించుటకు వాగ్దానం చేసినావో; దివ్య ఖుర్’ఆన్’లో, ఓ అల్లాహ్ నీవు పలికిన మాటల ప్రకారం { عَسَىٰٓ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًۭا مَّحْمُودًۭا } (…నీ ప్రభువు నిన్ను (పునరుత్థాన దినమున) ప్రశంసనీయమైన స్థానము (మఖామమ్ మ'హ్‌మూద్) నొసంగవచ్చు!) – ఆ ప్రశంసనీయమైన స్థానమును ఆయనకు ప్రసాదించు.” ఈ దుఆను ఎవరైతే పఠిస్తారో వారు పునరుత్థాన దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సిఫార్సుకు అర్హులు అవుతారు.