సకల శుభాల యజమాని, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, హదీథ్ అల్ ఖుద్సీ లో ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు: ‘ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుంటూ, నా దయ మరియు కరుణను ఆశిస్తూ, నిరాశ చెందకుండా ఉన్నంత కాలం, నేను నీ పాపాలను కప్పివేస్తాను, వాటిని తుడిచి వేస్తాను, మరియు దానిని పట్టించుకోను, ఈ పాపాలు మరియు అవిధేయత పెద్ద పాపాలలో (కబాఇర్ లలో) ఒకటి అయినప్పటికీ, "ఓ ఆదమ్ కుమారుడా! నీ పాపాలు ఆకాశాలకు భూమికి మధ్య ఉన్న అంతరాన్ని నింపేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; దాని చివరలను మరియు దాని వివిధ భాగాలను కప్పివేసేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; నీవు క్షమించమని నన్ను వేడుకుంటే, నేను వాటినన్నింటినీ చెరిపివేస్తాను మరియు నీ కొరకు వాటన్నింటినీ క్షమిస్తాను, అవి సంఖ్యలో ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోను.” ఓ ఆదము కుమారుడా! నీవు మరణానంతరం భూమి మొత్తం నిండి పోయేవన్ని పాపాలు మరియు అతిక్రమణలతో నా దగ్గరకు వచ్చినా; నీవు నాతో “షిర్క్” నకు పాల్బడకుండా (దేనినీ నాకు సమానంగా, నాకు సాటిగా, భాగస్వామిగా నిలబెట్టకుండా) “మువహ్హిద్”గా (ఏకదైవారాధనవాదిగా) మరణించినట్లయితే, నేను మొత్తం భూమిని నింపివేసేటంత క్షమాపణతో ఈ పాపాలు మరియు అతిక్రమణలను కలుసుకుంటాను; ఎందుకంటే నేను క్షమాపణలో అత్యంత విస్తృతమైన వాడిని మరియు “షిర్క్”ను తప్ప (బహుదైవారాధన తప్ప) అన్ని పాపాలను క్షమిస్తాను.