ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను ఐదు సంపూర్ణ వచనాలను బోధించారు, అవి: మొదటిది: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు. రెండవది: ఆయనకు నిద్ర అసంభవం; ఆయన సర్వ పోషకత్వం మరియు జీవం యొక్క పరిపూర్ణత వలన. మూడవది: ఆయన, తన వైపుకు ఎత్తబడే దాసుల ఆచరణలను మరియు భూమిపైకి పంపే వారి ఆహారములను తూకం వేయడం ద్వారా తూకమును తగ్గిస్తాడు మరియు పెంచుతాడు. కాబట్టి, ప్రతి ప్రాణి యొక్క వాటా మరియు భాగమైన ఆహారమును తాను తలిచినట్లుగా ఆయన తగ్గించి కుదిస్తాడు, మరియు పెంచి విశాలపరుస్తాడు. నాలుగవది: దాసులు రాత్రి చేసిన ఆచరణలు మరుసటి పగలు రాకముందే, మరియు పగలు చేసిన ఆచరణలు మరుసటి రాత్రి రాకముందే ఆయనకు సమర్పించబడతాయి; కావున, సంరక్షక దైవదూతలు రాత్రి కాలపు ఆచరణలను, రాత్రి ముగిసిన తర్వాత పగటి ఆరంభంలోనూ, మరియు పగటి కాలపు ఆచరణలను, పగలు ముగిసిన తర్వాత రాత్రి ఆరంభంలోనూ తీసుకుని పైకి వెళ్తారు. ఐదవది: ఆయనను చూడకుండా నిరోధించే ఆయన తెర కాంతి లేదా అగ్ని, ఒకవేళ ఆయన దానిని తొలగిస్తే, ఆయన సృష్టిలో ఆయన దృష్టి చేరినంత వరకు ఆయన ముఖ తేజస్సు కాల్చివేస్తుంది; ఆయన ముఖ తేజస్సు అంటే ఆయన కాంతి, ఆయన వైభవం మరియు ఆయన ప్రకాశం. దీని అర్థం ఏమిటంటే: ఒకవేళ ఆయన తనను చూడకుండా అడ్డుకుంటున్న తెరను తొలగించి, తన సృష్టి ముందు ప్రత్యక్షమైతే, ఆయన ముఖ తేజస్సు, ఆయన దృష్టి చేరినంత వరకు ఉన్న దానిని దహించివేసేది; అది సమస్త సృష్టి; ఎందుకంటే పరిశుద్ధుడు మరియు సర్వోన్నతుడైన ఆయన దృష్టి సమస్త సృష్టిని చుట్టుముట్టి ఉంది.