ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, ఎందుకంటే అవి విధేయతా గృహాలు మరియు దైవభక్తిపై స్థాపించ బడినటువంటివి. అల్లాహ్’కు అత్యంత అసహ్యకరమైన ప్రదేశాలు మార్కెట్లు, ఎందుకంటే అవి తరచుగా మోసం, వంచన, వడ్డీ, తప్పుడు ప్రమాణాలు, వాగ్దానాల ఉల్లంఘనలు మరియు అల్లాహ్ యొక్క జ్ఞాపకం (స్మరణ) నుండి తప్పుదారి పట్టించే ప్రదేశాలు.