అబీ ఖతాదా అస్’సలమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.” ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధిస్తున్నారు – ఎవరైనా ఏ సమయములోనైనా, ఎందుకొరకైనా మస్జిదుకు వచ్చి అందులోనికి ప్రవేశించినట్లయితే, అతడు మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు ఆచరించాలి - ఆ రెండు రకాతుల నమాజు ‘తహియ్యతుల్ మస్జిద్’ (మస్జిదునకు గౌరవ సూచకంగా చేయబడే నమాజు) అనబడుతుంది.

explain-icon

fawaed

  • ‘తహియ్యతుల్ మస్జిదు’ గా మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజును ఆచరించుట అభిలషణీయము (ముస్తహబ్).
  • ఈ నమాజు, మస్జిదులోనికి (నమాజు కొరకైనా, లేక ఏ ఇతర పని కొరకైనా) ప్రవేశించి, మస్జిదులోపల కూర్చోదలచిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగాక మస్జిదులోనికి ప్రవేశించి, కొద్ది సేపటిలో కూర్చోకుండానే బయటకు వెళ్ళిపోయే వారికి వర్తించదు.
  • భక్తుడు మస్జిదులోనికి ప్రవేశించినపుడు, ప్రజలు మరియు ఇమాము సామూహిక నమాజు ప్రారంభించేసి ఉండినట్లయితే, అతడు తహియ్యతుల్ మస్జిదు నమాజు ఆచరించవలసిన అవసరం లేదు. (అతడు నేరుగా జమాతులోనికి ప్రవేశించాలి).