అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్-అషజ్జి – అషజ్జి అబ్దిల్ ఖైస్ రదియల్లాహు అన్హుతో ఇలా పలికారు: “నిశ్చయంగా నీలో అల్లాహ్ ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి – అవి ప్రాజ్ఞత (దూరదృష్ఠి), వివేకం మరియు సహనము”.
ప్రామాణికమైన హదీథు - ముస్లిం నమోదు చేసినారు:
అత్యంత ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు మరియు అబ్దిల్ ఖైస్ తెగ నాయకుడైన అల్ మున్’దిర్ ఇబ్న్ అల్ ఆ’ఇజ్ అషజ్జి (రదియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు మీలో దేవుడు ఇష్టపడే రెండు లక్షణాలు ఉన్నాయి: తెలివితేటలు, ఆలోచనాశక్తి, గౌరవం మరియు తొందరపాటు లేకపోవడం (సహనం).
Benefits from the Hadith
సహనము మరియు ఓర్పు కలిగి ఉండాలి అనే హితబోధ ఉన్నది.
ఇందులో పరిణామాలను గురించి ఆలోచించడం మరియు ఆలోచనను ప్రోత్సహించడం ఉన్నాయి.
ఓర్పు మరియు సహనం ప్రశంసనీయమైన లక్షణాలు.
అల్లాహ్ తనలో సహజంగానే నింపిన మంచి వ్యక్తిత్వ లక్షణాల కొరకు ప్రతి ఒక్కరు ఆయనను స్తుతించాలి.
అల్ అషజ్జి రదియల్లాహు అన్హు ఎవరంటే, ముఖంపై, తలపై లేదా నుదుటిపై పెద్ద గాయం అయిన వ్యక్తి.