ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఈ విధంగా హితబోధ చేసినారు: తమ శక్తి సామర్థ్యాల మేరకు - అల్లాహ్ పట్ల నిజాయితీతో, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండి, సున్నత్ ను అనుసరిస్తూ సదాచరణలు చేయాలని, ఆచరణలలో హద్దుమీరడం గానీ, లేదా నిర్లక్ష్యం గానీ ఉండరాదని, వాటి ద్వారా నిర్దేశించబడిన మంచిని సాధించే సంకల్పముతో ఆచరించాలని, ఆ విధంగా వారి ఆచరణలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కాగలవని, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం వారిపై అవతరించడానికి కారణం అవుతుందని హితబోధ చేసినారు. తరువాత వారికి మీలో ఎవరూ కేవలం తమ ఆచరణల ఆధారంగా (తీర్పుదినమునాడు) రక్షించబడరని, అందుకు అల్లాహ్ యొక్క కరుణ, అనుగ్రహం కూడా అవసరమని తెలియజేసినారు. సహాబాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను “మీరు కూడా రక్షించబడరా ఓ రసూలుల్లాహ్! మీ ఆచరణలు ఎంతో ఉత్తమమైనవి అయినప్పటికీ?” అని ప్రశ్నించారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, నేను కూడా, అల్లాహ్ యొక్క కరుణ, ఆయన అనుగ్రహం నన్ను కప్పివేస్తే తప్ప.”