ఒక ముస్లిం తన సంభాషణలో ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనరాదని నిషేధించినారు. లేక ‘అల్లాహ్ మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అనడం (కూడా నిషేధమే). ఎందుకంటే అల్లాహ్ యొక్క చిత్తము మరియు ఆయన సంకల్పము – ఇవి రెండూ శుద్ధమైనవి మరియు పరిపూర్ణత కలిగినవి. వాటిలో ఆయనతో ఎవరూ భాగస్వాములు కాలేరు. ఆ రకమైన వాక్యములో, వ్యాకరణ నియమాల ప్రకారం “వావ్ 'و' ” అనే అరబీ అక్షరం ‘సముచ్చయము’ గా పని చేస్తుంది. దానితో ‘అల్లాహ్ తో పాటు మరొకరు కూడా ఆయన సమానులు’ అనే అర్థం వస్తుంది. అలా కాక ‘అల్లాహ్ కోరిన విధంగా ఆ తరువాత ఫలాన వారు కోరిన విధంగా’ అనవచ్చు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘మరియు’ అనే పదానికి బదులు ‘ఆ తరువాత’ అనే పదంతో దాసుని ఇష్టాన్ని అల్లాహ్ యొక్క ఇష్టానికి క్రింద, దానికి అనుయాయిగా చేస్తున్నారు. ఎందుకంటే వాక్యములో “ఆ తరువాత” అనే పదం వాక్యములో ఉన్న పదాలను తేలికగా వ్యాఖ్యానించడానికి దోహదపడుతుంది.