ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలుపుతున్నారు: ఎవరైతే అల్లాహ్ కు చెందవలసిన దానిని వేరే ఇంకెవరికైనా అంకితం చేస్తారో, ఉదాహరణకు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి దుఆ చేయడం, లేక ఆయనను గాక సహాయం కొరకు (ఆయన స్థానములో) వేరే ఇంకెవరినైనా అర్థిస్తాడో – మరియు అదే విధానం పై మరణిస్తాడు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు దానికి కొనసాగింపుగా ఇలా అన్నారు: “ఎవరైతే ఎవరినీ లేక దేనిని అల్లాహ్ కు సాటి కల్పించకుండా, ఆ స్థితిలోనే మరణిస్తాడో అతని గమ్యస్థానము స్వర్గము.”