ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా – తాను అబిసీనియాలో ఉన్నపుడు మారియా అని పిలువబడే ఒక చర్చిని చూసిన విషయాన్ని, అందులో విగ్రహాలు, చిత్రపటాలు, వివిధ రకాల అలంకరణలు చూసిన విషయాన్ని, వాటిని చూసి తాను అబ్బురపడిన విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విగ్రహాలు, చిత్రపటాలు అక్కడ చర్చిలో పెట్టి ఉండడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారిలో ఒక నీతిమంతుడు మరణిస్తే, వారు అతని సమాధిపై ఒక ఆరాధనాలయాన్ని (మస్జిదును) నిర్మించి, అందులో ప్రార్థనలు చేస్తారు. వారు అతని విగ్రహాన్ని, చిత్రపటాన్ని అందులో ఉంచుతారు. తరువాత ఆయన ఇలా విశదపరిచినారు: అలా చేసేవాడు అల్లాహ్ దృష్టిలో సృష్టిలోకెల్లా అత్యంత నీచుడు. ఎందుకంటే అతని ఆ ఆచరణ సర్వోన్నతుడైన అల్లాహ్ తో షిర్క్ చేయడానికి దారి తీస్తుంది (అంటే అల్లాహ్ కు సాటిగా, సమానులుగా వేరే వారిని నిలబెట్టుట).