ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నరకం లోనికి ప్రవేశించిన తరువాత అక్కడ చాలా తక్కువ శిక్ష పడి, ఆ శిక్షను అనుభవిస్తున్న వానితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: నీ దగ్గర ఈ ప్రపంచం మొత్తం మరియు అందులో ఉన్న ప్రతిదీ ఉన్నట్లైతే, ఈ శిక్ష నుండి విముక్తి పొందడానికి దానిని మొత్తం ఇచ్చివేస్తావా? దానికి అతడు: “అవును, ఇచ్చివేస్తాను” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఆదం వెన్నెముకలో ఉన్నపుడు అంటే మీ నుండి ఒడంబడిక తీసుకున్నపుడు, దీనికంటే చాలా తేలికైనది – నాకు ఎవరినీ మరియు దేనినీ సాటి కల్పించకు (కేవలం నన్ను మాత్రమే ఆరాధించు) – అని ఆదేశించాను. కానీ నేను నిన్ను ఈ ప్రపంచం లోనికి తీసుకు వచ్చినప్పుడు నీవు బహుదైవారాధనను తప్ప ప్రతిదానినీ నిరాకరించావు.