(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసినా దానిని తొలగించకుండా లేదా చెరిపివేయకుండా వదల రాదు అనే నిర్దేశాలతో నలువైపులకు పంపేవారు. అలాగే తన సహచరులను – ఎత్తుగా కట్టబడి ఉన్న ఏ సమాధినైనా లేదా ఏదైనా కట్టడము నిర్మించబడి ఉన్న ఏ సమాధినైనా సరే, దానిని ధ్వంసం చేయాలని లేదా నేలమట్టం చేయాలని, ఏ సమాధియైనా భూమికి ఒక మూరెడు ఎత్తు మాత్రమే ఉండాలనే నిర్దేశాలతో పంపే వారు.