ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అత్-తవాగీ” పేరిట ప్రమాణం చేయడాన్ని నిషేధించినారు. “తాగియహ్” అనే పదం యొక్క బహువచనం “అత్-తవాగీ”; ఇవి విగ్రహాలు, అల్లాహ్ ను వదిలి (లేదా అల్లాహ్ తో పాటు) బహుదైవారాధకులు వీటిని పూజించేవారు, ఆరాధించేవారు; ఇవి వారి దౌర్జన్యానికి మరియు అవిశ్వాసానికి కారణం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ తండ్రుల పేరున ప్రమాణం చేయడాన్ని కూడా నిషేధించినారు. ఇస్లాంకు పూర్వం అరబ్బులు గర్వంతో, గొప్పతో తమ తండ్రులపై ప్రమాణం చేయడం ఆనవాయితీగా ఉండేది.