అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే, (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక పోతున్న వానికి వ్యవధినిస్తాడో లేదా ఎవరైతే అతని అప్పులో కొంత భాగాన్ని తగ్గిస్తాడో, అతడికి అల్లాహ్ తన నీడ తప్ప మరింకే నీడ ఉండని ఆ తీర్పు దినమున తన అర్ష్ (సింహాసనము) క్రింద నీడ కల్పిస్తాడు”. ప్రామాణికమైన హదీథు - అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీసులో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే (పేదరికం కారణంగా) తీసుకున్న అప్పు తీర్చలేక బాధపడుతున్న వానికి తగినంత సమయాన్ని ఇస్తాడో లేదా అతడి అప్పు నుండి కొంత భారాన్ని తగ్గిస్తాడో, అటువంటి వాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు: తీర్పు దినము నాడు, సూర్యుడు తన పూర్తి ప్రతాపముతో ప్రకాశిస్తూ, అల్లాహ్ యొక్క దాసుల తలలను తాకేటంత క్రిందకు వస్తాడు, ఆ వేడికి వారంతా తల్లడిల్లి పోతుంటారు. ఏ నీడా అందుబాటులో లేని అటువంటి కఠినమైన సమయాన, అల్లాహ్ అతడికి తన సింహాసనము క్రింద నీడను ప్రసాదిస్తాడు. కనుక, అల్లాహ్ ఎవరికైతే నీడను ప్రసాదిస్తాడో, వారికి తప్ప ఇంకెవ్వరికీ ఆనాడు నీడ దొరకదు.

explain-icon

fawaed

  • అల్లాహ్ దాసులు కష్టాలలో ఉన్నపుడు వారికి సౌలభ్యం కలిగేలా సహకరించడం అనేది తీర్పు దినము నాటి భయానక పరిస్థితుల నుండి రక్షణ, ముక్తి పొందటము యొక్క ఘనత
  • ప్రతిఫలం ఆచరణ యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది.