అబూ హురైరా రదియల్లాహు అన్హు ఉల్లేఖన – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫజ్ర్ నమాజు సమయంలో బిలాల్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: “బిలాల్! ఇస్లాంలో నువ్వు చేసిన అత్యంత ఆశావహ ఆచరణ ఏమిటో నాకు చెప్పు, ఎందుకంటే నేను స్వర్గంలో నా ముందర నీ చెప్పుల సవ్వడి విన్నాను.” అతను చెప్పారు: “నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో, ఏ గడియలోనైనా ఉదూ చేసుకున్నప్పుడు, ఆ ఉదూతో నాకు విధివ్రాతలో వ్రాయబడినంత నమాజ్ తప్పకుండా ఆచరిస్తాను.” ప్రామాణికమైన హదీథు - అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
explain-icon

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలలో అతడిని స్వర్గంలో ఉన్నట్లు చూశారు. అప్పుడు ఆయన బిలాల్ ఇబ్న్ రబాహ్‌ రదియల్లాహు అన్హును చూసి ఇలా అడిగారు: 'ఇస్లాంలో నీవు చేసిన అత్యంత ఆశాజనకమైన ఐచ్ఛిక (నఫిల్) ఆచరణ ఏమిటో నాకు చెప్పు. ఎందుకంటే, నేను స్వర్గంలో నీవు నడుస్తున్నప్పుడు నీ చెప్పుల యొక్క మెల్లని శబ్దాన్ని నేను విన్నాను. బిలాల్ ఇలా చెప్పారు: నా దృష్టిలో అత్యంత ఆశావహమైన ఆచరణ ఏమిటంటే, నేను రేయింబవళ్ళలో ఏ గడియలోనైనా ఉదూ భంగమైన వెంటనే మరలా ఉదూ చేసుకుని, ఆ తర్వాత ఆ ఉదూతో నా ప్రభువు కొరకు, నా అదృష్టంలో వ్రాసి ఉన్నన్ని సాధారణ నఫిల్ నమాజులు ఆచరించాను.

explain-icon

fawaed

  • బిలాల్ రదియల్లాహు అన్హు సూచించిన ఆచరణ, అనగా ఉదూ చేసిన ప్రతిసారి నమాజ్ ఆచరించడం, అత్యంత ఆశావహమైన ఆచరణలలో ఒకటి మరియు స్వర్గ ప్రవేశానికి ఒక కారణం అవగలదు అనేది స్పష్టమవుతున్నది.
  • ప్రతి ఉదూ తర్వాత సలాహ్ చేయడం అభిలషణీయము.
  • ఆదర్శప్రాయుడు లేదా గురువు తన శిష్యుడి కార్యం గురించి అడగాలి; అది మంచిదైతే దానిపై స్థిరంగా ఉండమని ప్రోత్సహించాలి, లేకపోతే దాని నుండి వారించాలి.
  • బిలాల్ రదియల్లాహు అన్హు స్వర్గవాసులలోని వాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన సాక్ష్యం.
  • ఈ ప్రశ్న ఫజ్ర్ నమాజు సమయంలో అడగబడింది మరియు ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కలలో జరిగినట్లుగా సూచిస్తుంది మరియు ప్రవక్తల కలలు సత్యమైనవి.