సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నపుడు ఒక రాత్రి ఆయన చంద్రుని వైపు చూసి, అంటే పదునాలుగవ రాత్రి నాటి పూర్ణచంద్రుడిని; చూసి ఇలా అన్నారు: నిశ్చయంగా విశ్వాసులు తమ కళ్ళతో స్వయంగా కనులారా తమ ప్రభువును చూస్తారు; ఎటువంటి సందేహము లేకుండా. సర్వోన్నతుడైన తమ ప్రభువును చూడడానికి వారు గుంపులుగా గుమిగూడరు; వారికి ఎటువంటి అలసటా కలుగదు; మరియు ఎటువంటి కష్టమూ ఎదుర్కొనరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: ఫజ్ర్ నమాజును మరియు అస్ర్ నమాజును ఆచరించకుండా చేసే ప్రతి దాన్ని కత్తిరించ గల సామర్థ్యం మీకుంటే అలా చేయండి, ఆ నమాజులను సంపూర్ణముగా వాటి నిర్ధారిత సమయాలలో, జమాఅత్’తో ఆచరించండి. ఎందుకంటే అది, సర్వశక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క ముఖమును చూడడానికి అవకాశం కల్పించే కారణాలలో నిశ్చయంగా ఒకటి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “....వసబ్బిహ్ బిహంది రబ్బిక ఖబ్ల తులూఇష్షంసి వ ఖబ్లల్ గురూబి” (“....మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి, ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా”) (సూరహ్ ఖాఫ్ 50:39)