అబూ మూసా అల్-అష్అరీ రదియల్లాహు అన్హు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తనను యమన్‌కు పంపినప్పుడు, అక్కడ తయారుచేసే కొన్ని పానీయాలు నిషిద్ధమా అని ఆయనను అడిగారు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటి గురించి విచారించారు. అప్పుడు అబూ మూసా రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: "అవి 'అల్-బిత్" అంటే తేనెతో తయారు చేసిన రసం, మరియు 'అల్-మిజ్ర్' అంటే బార్లీతో తయారు చేసిన రసం." ఆయనకు మాటల సారాంశం ఇవ్వబడిన తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మత్తు కలిగించే ప్రతిదీ నిషిద్ధం."