ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ మద్యం అనబడుతుంది; అది తినడం ద్వారా కానీ, త్రాగడం ద్వారా కానీ, ముక్కుతో పీల్చడం ద్వారా కానీ, లేక ఇంకే విధంగానైనా కానీ. మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా హరాం చేయబడింది (నిషేధించబడినది); అది కొద్ది మొత్తములోనైనా, లేక ఎక్కువ మోతాదులోనైనా సరే. మరియు ఎవరైనా ఏ రకమైన మత్తుపదార్థాలు వాడినా, వాటిని తాగడం కొనసాగించి, చనిపోయే వరకు వాటి నుండి పశ్చాత్తాపపడకపోతే, అటువంటి వారు అల్లాహ్ శిక్షకు అర్హులు అవుతారు, స్వర్గంలో ఇవ్వబడే పానీయాలను తాగకుండా చేస్తాడు.