ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అని వివరిస్తున్నారు: మెదడును మొద్దుబారేలా చేసి, మానసిక సామర్థ్యాలపై నియంత్రణ కోల్పోయేలా చేసే ఏదైనా పానీయం లేదా ఆహారం ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం నిషేధించబడింది, అలాగే మెదడును మొద్దుబారేలా చేయకపోయినా – అటువంటి పదార్ధాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా నిషేద్ధమే.