"నేను నా తల్లి భర్త అబూతల్హా (రదియల్లాహు అన్హు) ఇంటిలో అతిథులకు పానీయాలు పోసేవాడిని. ఆ కాలంలో వారి మద్యం 'ఫదీఖ్' (ఖర్బూజా/ఖజూర్ పండ్ల కాచు మిశ్రమం). అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రకటనలను చాటింపు వేసేవాడు 'జాగ్రత్త! మద్యం నిషేధించబడింది' అని ప్రకటించాడు. అది విన్న వెంటనే అబూ తల్హా (రదియల్లాహు అన్హు) నాతో 'బయటికి వెళ్లి దాన్ని పారవేసి రా' అన్నారు. నేను వెళ్లి దాన్ని పారవేశాను, అది మదీనా వీధుల్లో ప్రవహించింది. 'నిషేధింపబడక ముందు మద్యం త్రాగి, అది ఇంకా కడుపులో ఉండగానే మరణించిన వారి సంగతి ఏమిటి?' అని ప్రశ్నించగా...అల్లాహ్ ఈ వాక్కును అవతరింపజేశాడు: "ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నారో, వారు ఇంతకు ముందు తిన్న (నిషిద్ధమైన) వాటిపై ఏ పాపం లేదు..." (సూరతుల్ మాయిదా 5:93) "ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేస్తున్నారో, వారు ఇంతకు ముందు తిన్న (నిషిద్ధమైన) వాటిపై ఏ పాపం లేదు..." (సూరతుల్ మాయిదా: 93) అంటే "ఎవరు విశ్వసించారో (ముస్లింలు అయారో), వారు మద్యం నిషేధించబడక ముందు దానిని తిన్నందుకు మరియు తాగినందుకు వారిపై ఏ పాపం లేదు."