ఈ హదీథులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా తెలియజేస్తున్నారు: భూమి యొక్క అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం వ్యాపిస్తుంది, రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో, ఈ ధర్మం అక్కడి వరకు చేరుకుంటుంది అని. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ధర్మాన్ని ప్రవేశపెట్టకుండా ఏ ఇంటినీ వదిలి పెట్టడు, పట్టణాలలో, గ్రామాలలో, ఎడారిలో లేదా అరణ్యంలో ఎక్కడైనా సరే. ఎవరైతే ఈ ధర్మాన్ని అంగీకరించి, స్వీకరిస్తారో, దానిని విశ్వసిస్తారో వారు (అల్లాహ్) ఇస్లాంకు ప్రసాదించే గౌరవంతో గౌరవించబడతారు, మరియు ఎవరైతే దానిని తిరస్కరిస్తారో, మరియు ఆ ధర్మాన్ని విశ్వసించరో, అలాంటి వారు అవమానానికి, పరాభవానికి గురిచేయబడతారు. ఈ హదీసు ఉల్లేఖించిన సహాబీ తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలియజేసారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ప్రకటన నిజమవడాన్ని తాను చూశానని, ముఖ్యంగా తన కుటుంబ సభ్యులలో - ఎవరైతే ఇస్లాం స్వీకరించినాడో, అతడు మంచితనం, గౌరవం మరియు కీర్తిని పొందాడు, మరియు ఎవరైతే అవిశ్వాసిగానే మిగిలి పోయాడో, అతడు ముస్లింలకు జీజియాగా డబ్బు చెల్లించవలసి రావడంతో పాటు, అవమానానికి మరియు పరాభవానికి గురయ్యాడు.