ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహబాలకు దజ్జాల్’ను గురించి, అతని లక్షణాలను గురించి, అతనికి సంబంధించిన చిహ్నాలను గురించి – తన కంటే ముందు వచ్చిన ఏ ప్రవక్తా కూడా తన జాతి జనులకు చెప్పని విషయాలను వివరిస్తున్నారు. ఉదాహరణకు: అతడు ఒంటి కన్ను వాడు. మరియు కంటికి స్వర్గము మరియు నరకముల వలే కనిపించే, స్వర్గము మరియు నరకములను పోలిన వాటిని తయారు చేసి, సర్వోన్నతుడైన అల్లాహ్ దజ్జాల్ తో పంపిస్తాడు. కానీ అతడి స్వర్గము, వాస్తవానికి నరకం, అలాగే అతడి నరకం వాస్తవానికి స్వర్గం అయి ఉంటాయి. ఎవరైతే అతడిని (విశ్వసించి) అనుసరిస్తారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది భగభగ మండే అగ్ని అయి ఉంటుంది; అలాగే ఎవరైతే అతడిని (విశ్వసించరో) అనుసరించడానికి నిరాకరిస్తారో, అతనికి అవిధేయత చూపుతారో, ప్రజలు చూస్తుండగా అతడు వారిని నరకములోనికి ప్రవేశింపజేస్తాడు, కానీ వాస్తవానికి అది మంచి స్వర్గం అయి ఉంటుంది. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు సృష్టించే అరాచకత్వాన్ని గురించి, అతడి పరీక్షల గురించి, నూహ్ అలైహిస్సలాం తన ప్రజలను హెచ్చరించిన విధంగా హెచ్చరించినారు.