ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని: “ఆ ఘడియ కొరకు నీవు ఏ ఏ సత్కార్యాలు ఆచరించి సిద్ధపరుచుకున్నావు?” అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వ్యక్తి : "నేను అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తున్నాను; అది తప్ప ప్రళయ ఘడియ కోసం నేను ఏ గొప్ప ఆచరణలను సిద్ధం చేసుకోలేదు" అన్నాడు; మరియు దీనిని గమనించినట్లయితే అతడు హృదయపు ఆరాధనలను, శరీరక ఆరాధనలను లేదా ఆర్థిక పరమైన ఆరాధనలను, లేక ఇతర ఏ ఆరాధనలను ప్రస్తావించలేదు; ఎందుకంటే అవన్నీ ప్రేమ యొక్క శాఖలు మరియు అవన్నీ దానిపై ఆధారపడి ఉంటాయి. నిజమైన ప్రేమ ఆ వ్యక్తిని ధర్మబద్ధమైన పనులలో కష్టపడటానికి ప్రేరేపిస్తుంది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, స్వర్గములో నీవు వారితో ఉంటావు.” ఈ శుభవార్త పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు అమితంగా సంతోషపడినారు. అనస్ రదియల్లాహు అన్హు – తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూ బక్ర్ మరియు ఉమర్ రదియల్లాహు అన్హుమా లను ప్రేమిస్తున్నానని; దాని కారణంగా, వారి అంత గొప్పగొప్ప ఆచరణలు ఆచరించలేకపోయినా, స్వర్గములో వారితో పాటు ఉంటాననే ఆశాభావమును వ్యక్తపరిచినారు.