ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అంటూ భీతిల్లిన స్థితిలో, భయకంపితులై, జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా వద్దకు వచ్చారు. భయకంపితులై ఉన్న స్థితిలో “లా ఇలాహ ఇల్లల్లాహ్...” అనడం ‘ఏదో చెడు జరుగబోతుంది’, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను ఆశ్రయించడం, మరియు ఆయనను మొరపెట్టుకోవడం తప్ప దాని నుండి తప్పించుకునే అవకాశం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వచ్చి పడబోయే అరిష్టమునుండి ఈ అరబ్బులకు వినాశం గాను, ఈ రోజు య’జూజ్ మరియు మ’జూజ్ ల అడ్డుగోడలో ఇంత రంధ్రం చేయబడింది, అది దుల్’ఖర్నైన్ నిర్మించిన అడ్డుగోడ..” అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి బొటనవ్రేలును, దానికి ప్రక్కనే ఉన్న చూపుడు వ్రేలును కలిపి గుండ్రంగా, వృత్తాకారంగా చేసి చూపించారు. జైనబ్ రదియల్లాహు అన్హా “మన మధ్య సజ్జనులు, ధర్మపరాయణులు ఉండగా అల్లాహ్ వినాశనం వచ్చి పడేలా ఎలా చేస్తాడు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఆమెతో ఇలా అన్నారు: "అశ్లీలత, దుర్మార్గం, పాపాలు, వ్యభిచారం, మద్యపానం మరియు ఇతర విషయాల రూపంలో చెడు పెరుగుతుంటే, వినాశనంపై వచ్చి పడుతుంది.