అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ప్రజలలో అత్యంత నీచులు, దుష్టులు ఎవరంటే, వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది, మరియు ఎవరైతే సమాధులను తమ ఆరాధనా గృహాలుగా (మస్జిదులుగా) చేసుకున్నారో.” హసన్ హదీథు - ఆహ్మద్ నమోదు చేసినారు:
explain-icon

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత నీచులు, దుష్టులను గురించి ఇలా తెలియజేస్తున్నారు: వారు జీవించి ఉండగానే ప్రళయఘడియ వచ్చి పడుతుంది; మరియు ఎవరైతే సమాధులను మస్జిదులుగా చేసుకున్నారో, అంటే వారు సమాధుల వద్ద తమ నమాజులను ఆచరిస్తారు, మరియు వాటి వైపునకు తిరిగి నమాజులను ఆచరిస్తారు.

explain-icon

fawaed

  • ఇందులో సమాధులపై మస్జిదులను నిర్మించుట నిషేధం అని తెలుస్తున్నది. ఎందుకంటే అది బహుదైవారాధనకు దారి తీసే మూలకారణాలలో ఒకటి.
  • సమాధులపై మస్జిదులు నిర్మించకపోయినా, అక్కడ నమాజులను ఆచరించుట నిషేధము, ఎందుకంటే మస్జిదు అంటే ఒక నిర్మాణం పేరు కాదు. నిర్మాణం ఏమీ లేకపోయినా, అల్లాహ్ కు సజ్దాలు ఆచరించబడే ప్రతి స్థలం కూడా మస్జిదే.
  • ఎవరైతే గతించిన ప్రవక్తల సమాధులను, లేక తమ పుణ్యపురుషుల సమాధులను మస్జిదులుగా చేసుకుని అక్కడ నమాజులను ఆచరిస్తాడో, వాడు ఈ సృష్టి మొత్తములో అత్యంత నీచుడు, దుష్టుడు; అతడు “నా సంకల్పము పుణ్యపురుషులను ఆరాధించుట కాదు, కేవలం అల్లాహ్ యొక్క సామీప్యానికి చేరుకొనుటయే” అని ఎంతగా దావా చేసినప్పటికీ.
explain-icon

ఇంకా