ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అవిశ్వాసపు ఆచరణలు అనదగిన ఒక ఆచరణను గురించి, మరియు అఙ్ఞాన కాలపు సంప్రదాయాలలో ఒక దానిని గురించి (రెండు విషయాల గురించి) ఇలా తెలియజేస్తున్నారు: అవి: మొదటిది: ప్రజల వంశావళిని కించపరుస్తున్నట్లుగా మాట్లాడడం; అవమానించడం, వారిని కించపరచడం మరియు వారి పట్ల గర్వంగా ప్రవర్తించడం. రెండవది: ఏదైనా విపత్తు సంభవించినపుడు స్వరాన్ని పెంచి “ఖద్ర్” (విధివ్రాత) పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, తీవ్రమైన అసంతృప్తితో బట్టలు చింపుకోవడం.