ఈ హదీథ్ అల్ ఖుద్సీలో – అల్లాహ్ అవిశ్వాసులూ మరియు బహుదైవారాధకులను గురించి తెలిపినాడు, వారు తనపట్ల అసత్యాలు పలుకుతున్నారని, తనకు బలహీనతలు, లోపాలు, కొరతలు ఆపాదిస్తున్నారని తెలియజేసినాడని; వారు అలా అనడానికి వారికి ఏ హక్కూ లేదు – అని అల్లాహ్ తెలియజేసినాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికినారు. అల్లాహ్’ను గురించి వారి అబద్ధాల విషయానికొస్తే: అల్లాహ్ వారిని శూన్యం నుండి మొదటిసారి సృష్టించినట్లు వారి మరణానంతరం వారిని తిరిగి తీసుకురాలేడని వారి వాదన. వారి వాదనను అల్లాహ్ వారిపై తిప్పి కొట్టినాడు. ఆయన ఇలా సమాధానమిచ్చాడు: శూన్యం నుండి సృష్టిని ప్రారంభించినవాడు వారిని తిరిగి తీసుకు రాగలడు, అది ఆయనకు మరింత సులభం. సృష్టి మరియు పునరుత్థానం రెండూ అల్లాహ్ కు సమానమైనవే. అల్లాహ్ అన్ని విషయాలపై అధికారం కలవాడు. అల్లాహ్’ను అవమానించే విషయానికొస్తే: వారి మాటలు: ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు అని అనడం. వాటిని ఆయన వారిపై త్రిప్పి కొట్టినాడు; నిశ్చయంగా తాను ఒకే ఒక్కడు, ఏకైకుడు, అద్వితీయుడు, ప్రతివిషయానికి సంబంధించి పరిపూర్ణమైనవాడు, అంటే ఉదాహరణకు ఆయన నామముములలో, ఆయన గుణ విషేశాలలో, ఆయన చర్యలలో అన్నింటిలో ఆయన పరిపోర్ణమైనవాడు, ఎటువంటి లోపమూ లేనివాడు, ఏటువంటి కొరతా లేనివాడు, లోపాలకూ, కొరతలకూ అతీతుడు, స్వయం సమృధ్ధుడు, ఆయన ఎవరి అవసరమూ లేనివాడు; కానీ ఆయన అవసరం ప్రతివారికీ ఉంది. ఆయన ఎవరి తండ్రీ కాదు, ఆయన ఎవరి సంతానమూ కాదు. సర్వలోకాలలో ఆయనను పోలినది ఏదీ లేదు. పరమపవిత్రుడూ, సర్వోన్నతుడు.