ఇబ్ను అబ్బాస్ రజియల్లాహు అన్హు ఈ ఆయత్ వ్యాఖ్యానం ఇలా చేశారు :అల్లాహ్ ప్రస్తావించిన ఈ విగ్రహాల గురించి నూహ్ జాతి ప్రజలు వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని భోదించుకునేవారు,అప్పటికి నూహ్ అలైహిస్సలామ్ వారికి షిర్కు చేయకూడదని వారించారు,అవి వాస్తవానికి గతించిన సత్పుర్షుల పేర్లు,షైతాన్ చెడు ప్రేరణలకు లోనై ప్రజలు వారి పట్ల అతిశయిళ్ళారు,చివరికి వారి ప్రతిమలను ఏర్పరుచుకున్నారు,ఆ తరువాతి కాలం గడిచాక అవే విగ్రహాలుగా ప్రతిష్టించుకోబడ్డాయి,పిదప అల్లాహ్ ను వదిలి వాటిని ఆరాధించడం జరిగింది.